క్రైమ్

మదీనా ప్రాంతంలోని మార్కెట్లోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

చాంద్రాయణగుట్ట, భారతజ్యోతి :పాతబస్తీలోని పేరుగాంచిన మదీనా ప్రాంతంలోని మార్కెట్లోని వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. సోమవారం ఉదయం దుకాణాలు తెరువకముందే ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెల్లరేగాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన చార్మినార్ పోలీసులు అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించి వెంటనే ఫైర్ ఇంజన్ రప్పించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ముందుగా షాదాబ్ హోటల్ వైపు ఉన్న బాంబే హౌసరీ బట్టల దుకాణం గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించి. వరుసగా పైన ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి వరుసగా పది పది నుండి 15 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం కింద ఉన్న దుకాణాల కాకుండా పైన ఉన్న షాపులు గోదాం లోని గోదాములకే ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది. దసరా దీపావళి పండుగలు వచ్చాయి అంటే చాలు ఆ ప్రాంతం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నగరం నుండి అనేకమంది కొనుగోలుదారులు ఈ మార్కెట్కు విచ్చేస్తుంటారు. పండుగలను పురస్కరించుకొని వస్త్ర వ్యాపారాలు పెద్ద ఎత్తున వస్త్రాలను బట్టలను కనుగోలు చేసినట్లు దుకాణ యజమానులు వాపోయారు. ఉదయం ఉదయం మొదలైన మంటలు మధ్యాహ్నం వరకు అదుపులోకి రాకపోవడంతో నాలుగు అగ్నిమాపక దళాలతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ మంటల్లో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు .మధ్యాహ్నం 12:30 కు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి ఈ విష..యం తెలుసుకున్న చార్మినార్ శాసనసభ్యులు మీర్ జల్పెకర్ అలీ విచ్చేసి దుకాణ యజమానులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని భరోసాను కల్పించారు.ఎక్కువ శాతం బొంబే హౌసరీ బట్టల షాపు గోదాంలో భారీ ఎత్తున అగ్నిప్రమాదం సంభవించడంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు ఆ షాపు యజమాని మమ్మద్ సాజిద్ తెలిపారు ..ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button