తెలంగాణ

స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు విలువైన వస్తువులను జాగ్రత్తగా లాకర్లలో ఉంచుకోవాలి…: ఇన్స్పెక్టర్ బి.సాయి ప్రకాశ్ గౌడ్

బి.సాయి ప్రకాశ్ గౌడ్, ఐ.ఎస్. సదన్ ఇన్స్పెక్టర్.

చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 16 భారత జ్యోతి : దసరా పండుగకి స్వగ్రామానికి వెళ్లే ప్రజలు ఇంట్లోని తమ విలువైన వస్తువులు, నగదు, బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని ఐ.ఎస్. సదన్ ఇన్స్పెక్టర్ బి.సాయి ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ…. పండుగ సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచడం, బయట గేటుకు లోపల నుంచి తాళం వేయడం… ఇంటి ముందు గదిలో లైట్ వేసి ఉంచడం… పేపర్ బాయ్, పాల వారికి రావొద్దని చెప్పాలని సూచించారు. ఊరికి వెళ్లేటప్పుడు నమ్మకమైన వారికి, స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలు తమ ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button