రోడ్డు ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి…..
రోడ్డు ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి చెందడంతో పెద్ద అంబర్పేట్ లో విషాద ఛాయలు అమలుకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి…..
చిన్న పాపకు గాయాలు…..
రోడ్డు ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి చెందడంతో పెద్ద అంబర్పేట్ లో విషాద ఛాయలు అమలుకున్నాయి.
దసరా పండుగ వీరి కుటుంబంలో విషాదఛాయలు మిగిల్చింది……
హయత్ నగర్ అక్టోబర్ 18 భారత జ్యోతి.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూటీ ని కారు వెనుక నుండి ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందగా మూడు సంవత్సరాల చిన్నారి పాపకు తీవ్ర గాయాలైన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్ద అంబర్పేట్ గ్రామానికి చెందిన జంగయ్య అంబర్పేట్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు నలుగురు కుమార్తెలు పెద్ద కుమార్తె రేఖ,రెండో కుమార్తె మనిషా, మూడో కూతురు అనుష నాలుగో కూతురు శిరీష లు మృతురాలి తండ్రి జంగయ్య సోదరుని కుమారుడు నవీన్ (25) జంగయ్య వద్దనే ఉంటున్నారు. జంగయ్య పెద్ద కుమార్తె మృతురాలు శంషాబాద్, సుల్తాన్ పల్లి గ్రామానికి ఇచ్చి వివాహం చేశాడు.వీరికి ఒక కుమార్తె సర్విత ఈ ప్రమాదంలో చిన్నారి సర్వీతకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన వీరిని సమీపంలోని సన్రైజ్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. వీరిని పరిశీలించిన డాక్టర్లు అక్క తమ్ముడు మృతి చెందారని సన్రైజ్ హాస్పిటల్స్ డాక్టర్ వెల్లడించారు. నవీన్ దసరా పండుగకు తన అక్క అయినటువంటి రేఖను, కోడలేనా సర్వేతను సుల్తాన్ పల్లి నుండి పెద్ద అంబర్పేట్ కు ద్విచక్ర వాహనమైనటువంటి స్కూటీTG O7G 2690 పై తీసుకుని వస్తుండగా మార్గమధ్యలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుక నుండి అతివేగంగా వచ్చిన మహేంద్ర తార్ వెహికల్ TG 07.P2511 ఢీకొట్టడంతో నవీన్(25) రేఖ(30) అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి పాప సర్వితకు తీవ్ర గాయాలైనవి ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగక అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుందామని అక్కని కోడల్ని తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ముత్యువు రూపంలో దూసుకు వచ్చిన కార్ ఇరువురిని బలి తీసుకోవడమే కాకుండా పాపకు తీవ్ర గాయాలకు గురిచేసింది. ఈ ప్రమాదంలో తమ్ముడు అక్క మృతి చెందడంతో పెద్ద అంబర్పేట్ గ్రామంలో విషాదఛాయల అమలుకున్నాయి వీరి కుటుంబంలో ఆనందం కంటే దుఃఖమే వీరికి మిగిలింది. రోడ్డు ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి చెందడంతో బండ్ల జంగయ్య కుటుంబ సభ్యులు సన్రైజ్ హాస్పిటల్ ముందు బోరున వినిపిస్తుండడంతో చూపర్లు కంటతడి పెట్టారు. ఈ విజయదశమి ఈ కుటుంబ సభ్యులకు ఆనందమే కాదు దుఃఖాన్ని మిగిల్చిందని హాస్పిటల్ సమీపంలోని అక్క తమ్ముని చూసిన ప్రజలు దిగ్బాంతి వ్యక్తం చేశారు.



