హైమాస్ట్ స్తంభాలను ప్రారంభించిన :సర్పంచ్ లపంగి నర్సింహా
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులతో హైమాస్ట్ స్తంభాల ఏర్పాటు

హైమాస్ట్ స్తంభాలను ప్రారంభించిన :సర్పంచ్ లపంగి నర్సింహా
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులతో హైమాస్ట్ స్తంభాల ఏర్పాటు
రాంరెడ్డిపల్లి: గ్రామ అభివృద్ధిలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నిధుల నుంచి మంజూరైన హైమాస్ట్ స్తంభాలను రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా గారు ప్రారంభించారు. ఈ హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో గ్రామంలో రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కలగనుంది.
గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సర్పంచ్ లపంగి నర్సింహా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొగాకు సైదులు, వార్డు సభ్యులు పగిల్ల యాదమ్మ, పగిల్ల శంకర్, భీమనగోని మల్లమ్మ, భీమనగోని యాదయ్య, పగిల్ల దవాలమ్మ, పగిల్ల వంశీ, లపంగి మహేందర్, హైమా, భాస్కర్, నిరంజన్, గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగు నర్సింహా, పాముల కడారి ఎర్రయ్య, సిరిపంగి శీను, పొగాకు జంగయ్య, పోలగోని యాదయ్య, పీర్ల అసిస్టెంట్ సలీవోజు యాదయ్య, పాముల నర్సింహాతదితరులు పాల్గొన్నారు.


