హిందూ స్మశాన వాటిక స్థలంలో ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులను అడ్డుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.

హిందూ స్మశాన వాటిక స్థలంలో ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులను అడ్డుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.
హయత్ నగర్ అక్టోబర్ 13 భారత జ్యోతి.
హయత్ నగర్లోని మునుగనూర్ రోడ్ లో ఉన్న హిందూ స్మశాన వాటికకు సంబంధించిన స్థలంలో, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది చేపడుతున్న ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులను తీవ్రంగా ఖండిస్తూ, స్థానిక మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను నిలిపివేయించారు.ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ భూమి వివిధ కులాలకు చెందిన ప్రజల స్మశాన వాటికకు సంబంధించినదని, అటువంటి స్థలంలో ఎవరికి కనీస సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.స్మశాన వాటిక స్థలం అనేది స్థానిక ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి పనులు చేపట్టడం సరికాదని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని, స్మశాన వాటిక స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.



