క్రైమ్

ఎంవీఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపైనా పోలీసులు కేసు నమోదు.

ఎంవీఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపైనా పోలీసులు కేసు నమోదు.

సరూర్ నగర్, అక్టోబర్ 20 భారత జ్యోతి: రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల యజమానియా నిర్లక్ష్యం వలన విద్యార్థి మృతి చెందడం పై కళాశాల యజమాన్యంపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతికి కారకులు కావడం వారి నిర్లక్ష్యానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు.
కళాశాలలో సంభవించిన ప్రమాద ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ‘సాకేత్’ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఎంవీఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో భారీగా ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్ తగినంత బలం, సరైన సపోర్టు లేకుండా అమర్చడం వల్లే అది అకస్మాత్తుగా కుప్పకూలి ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, బాధ్యతారాహిత్యంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినందున ఈవెంట్ మేనేజర్, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.విద్యార్థుల భద్రతను విస్మరించిన కళాశాల యాజమాన్యం పాత్రపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నామని, నిర్లక్ష్యానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button