
మానవసేవే మాధవసేవ.
చేపూరి శంకర్.
ఎల్బీనగర్ అక్టోబర్ 12 భారత జ్యోతి.
మానవసేవే మాధవ సేవ అని ప్రమాదంలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడమే మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ముఖ్య ఉద్దేశం అని చైర్మన్ చేపూరి శంకర్ అన్నారు.
వికారాబాద్ కు మోటుపల్లి చెందిన ఫోజియా బేగంకు
ప్లేట్లెట్స్ పడిపోవడంతో బ్లడ్ కూడా 4.9 ఉండడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో బ్లడ్ ఎమర్జెన్సీ ఉందని సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ కు ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో ఏబీ పాజిటివ్ బ్లడ్ ను చేపూరి శంకర్ అందజేయడం జరిగింది
సకాలంలో బ్లడ్ అందించిన శంకర్ కు కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు
మానవసేవే మాధవసేవ అని, మదర్ తెరిస్సా స్పూర్తితో
ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నామని చేపూరి శంకర్ తెలిపారు.




