
చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 14 భారత జ్యోతి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం చారిత్రాత్మక, ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయానికి విచ్చేసిన మెట్టు సాయి కుమార్ ను ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.వెంకటేష్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మెట్టు సాయి కుమార్ పేరున ఆలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేష్ మెట్టు సాయి కుమార్ ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి చంద్రశేఖర్ పాల్గొన్నారు.



