ఎరుకల నాంచారమ్మ కాలనీలోని డబల్ బెడ్ రూమ్ లో అంతా గోల్మాల్.
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు..

ఎరుకల నాంచారమ్మ కాలనీలోని డబల్ బెడ్ రూమ్ లో అంతా గోల్మాల్.
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు..
ఎల్బీనగర్ అక్టోబర్ 16 భారత జ్యోతి.
అట్టడుగున ఉన్న నిరుపేదల కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకు దక్కకుండా అధికారుల అండదండలతో దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. దీంతో నాంచారమ్మ కాలనీలోని డబల్ బెడ్ రూములలో దళారులు తమకు నచ్చిన వారికి డబల్ బెడ్ రూములు కేటాయించి వారి నుండి లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మనసురాబాద్ లో 1.34 ఎకరాల విస్తీర్ణంలో డబల్ బెడ్ రూమ్ లను రెండు బ్లాకులుగా విభజించి నిర్మించారు. అయితే బి బ్లాక్ లోని ఖాళీగా ఉన్న 84 ప్లాట్లను ఆసరాగా చేసుకొని . సాగర్ గంగయ్య అనే వ్యక్తి ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు అని చెప్పుకుంటూ.
ఇల్లు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1.5 లక్షల నుంచి,3 లక్షల వరకు వసూళ్ల పర్వానికి పాల్పడ్డారు. సగం డబ్బులు ఇచ్చినా వారిని మిగతా డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులకు పట్టాలు 20 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు ఇండ్లు దక్కక పోగా పోరుగు జిల్లాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఇండ్ల పట్టాలు రావడం గమనార్హం బాధితులు అదేమిటి అని ప్రశ్నించగా మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీకు రాలేదు డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే వచ్చాయని దళారులు బహిరంగంగా దబాయిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై ఇటీవల ఒక మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా స్థానికులు ఆమెని అడ్డుకున్నారు. మరొకవైపు ఇండ్ల పట్టాలు పొందిన కొందరు వ్యక్తులు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి..అదేవిధంగా కుంట్లూరులో ఉన్న డబల్ బెడ్ రూములు చూపించి అమాయకుల దగ్గర నుండి లక్ష నుండి మూడు లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ వ్యవహారంపై హౌసింగ్ పీడీ పాత్ర పై పలు ఆరోపణలు.అక్రమ దందాల్లో హౌసింగ్ పీడీ చంప్లా నాయక్ పాత్ర పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెవెన్యూ అధికారుల జోక్యం లేకుండా పిడి చెంప్లా నాయక్ అంతా తానే వివరిస్తూ సాగర్ గంగయ్య అనే వ్యక్తికి కొమ్ముకాస్తున్నాడని ఎరుకల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో స్థానికులు ప్రజావాణి ద్వారా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై అనుమానాలకు తావిస్తోంది అని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేసి, అనర్హులకు కేటాయింపచేసిన పట్టాలను రద్దుచేసి సంబంధిత దళారులు,అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు, ఎరుకల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన మాకు ఇవ్వకుండా డబ్బులను వసూలు చేస్తూ ఆల్ ఇండియా ఎరుకల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు అని సాగర్ గంగయ్య చెప్పుకుంటూ అర్హులకు వచ్చిన ఇండ్లకు కూడా డబ్బులు కట్టాలని లక్షల్లో వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వేధిస్తున్నాడని బాధితులు తెలిపారు..




