ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

గాలివీడు, న్యూస్ అక్టోబర్ 11
గాలివీడు మండలం కుమ్మరిపల్లెలో రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాలివీడు మండలం కుమ్మరిపల్లె గ్రామంలో ‘రెడ్స్’ సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి అత్యంత ఉత్సాహంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
బాలికల హక్కులను కాపాడుతూ, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించాలని, వారి రక్షణ, విద్య మరియు సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. బాలికలను రక్షించుకుందాం – సమాజంలో వారికి భద్రత కల్పిద్దాం” అనే నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి.
ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థ సిబ్బంది కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎఫ్ సి భారతమ్మ, ఎన్ ఎఫ్ నాగేశ్వరి,గ్రామ పెద్దలు, పిల్లలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలికల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.



