
ఎల్బీనగర్ అక్టోబర్ 14 భారత జ్యోతి.
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ ప్రాంతంలో చుట్టుపక్కల కాలనీవాసులచే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇట్టి డంపింగ్ యార్డ్ నుంచి ప్రతిరోజు దుర్గంధమైన వాసన వస్తుందని తెలిపారు.అట్టి వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న రక్తం,కొవ్వు పదార్థాలు,మురుగునీటి వల్ల పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా వర్షం పడినప్పుడు ఈ వ్యర్థాలు కలుషితమై తీవ్ర దుర్వాసన వెలువడుతోందని దీని కారణంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు శ్వాస సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,దుర్వాసనను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.అలాగే ఇక్కడ ప్రతినిత్యం రాత్రిపూట వ్యర్ధాలను రోడ్డు మీదనే పడేయడం జరుగుతుందని కమిషనర్ గారికి తెలిపారు.అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఆరు కోట్ల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.ఇట్టి డంపింగ్ యార్డ్ నందు ఎక్కడెక్కడ నుంచో ట్యాంకర్లు వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరుగుతుందని నా దృష్టికి తీసుకువచ్చిన నేపద్యంలో అప్పటి అధికారులతో మాట్లాడి సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది గుర్తు చేశారు.అలాగే ఇక్కడ చెత్త వేసే లారీలను గుర్తించి పెద్ద ఎత్తున జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.అందులో భాగంగా గతంలో హైడ్రా,జీహెచ్ఎంసీ,ఫారెస్ట్,హైలా వంటి సంబంధిత శాఖాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడ నిల్వ ఉన్న మురికినీటిని తరలించేందుకు వెంటనే ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.అలాగే జంతు కళేబరాలు మరియు వ్యర్థ పదార్థాలు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వాసన రాకుండా పర్యవేక్షణను బలోపేతం చేసి దీనికి అనుగుణంగా అధికారులచే మోటార్లు ఏర్పాటు చేసి నిల్వ ఉన్న మురికినీటిని తరలించడం జరిగింది అని తెలిపారు.అలాగే ఆటో నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్,ఫర్టిలైజర్ గోడన్స్,మెకనికల్ షెడ్డులు అన్నీ తనిఖీ చేసి ఎవరైతే డ్రైనేజీ లైన్ల ద్వారా వ్యర్థ పదార్థాలు,రసాయనాలు పారబోస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.అలాగే అక్కడ ఒక వాచ్మెన్ కూడా గతంలో నియమించడం జరిగిందని తెలిపారు.అలాగే ఎస్టిపి ప్లాంట్స్ కూడా నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.ఇప్పటివరకు దాదాపు 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు.కావున ఇట్టి డంపింగ్ యార్డ్ ప్రాంతంలో వ్యర్ధాలు పోయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి కమిషనర్ ని కోరారు.రాత్రిపూట డంపు చేసే వాహనాలను గుర్తించి అట్టి వాహనం సీజ్ లేదా భారీ జరిమానా విధిస్తే కొంతమేర సమస్య నివారించవచ్చని తెలిపారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సుధీర్ రెడ్డి సూచించిన విషయాలు పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రాత్రి పూట వచ్చే వాహనాలపై నిఘా పెట్టడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు పక్కల డంపింగ్ చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి,టంగుటూరి నాగరాజు,జక్కిడి రఘువీర్ రెడ్డి,సంతోష్ గుప్తా,రవి, బాలరాజ్ తో పాటు డంపింగ్ యార్డ్ ప్రభావిత కాలనీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.




