అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తెలంగాణరాజకీయంవిధ్యసినిమా
బాలికల హక్కులను కాపాడాలి.

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 11:- బాలికల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, లింగ అసమానతలు, విద్యా, పోషకాహారం, వివాహాలు, బాలికల చట్ట పరమైన హక్కులపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా మహిళ అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న విద్యా పోషణ చట్టపరమైన వైద్య సంరక్షణ రక్షణ హింస బలవంతపు బాల్య వివాహాలపై వివక్షత వంటి వాటిపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. కార్యక్రమంలో మహిళ నాయకులు భాగ్యలక్ష్మి, కర్రెమ్మ, చిట్టెమ్మ నాగమద్దమ్మ మీనాక్షి దానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.




