
చాంద్రాయణగుట్ట, భారత జ్యోతి: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజా వీరాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో క్రాంతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం జిహెచ్ఎంసి రిటైర్డ్ ఏసిపి బి.రాజేందర్ కుమార్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ అసోసియేషన్ సభ్యులు రాజేందర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు బి.రమేష్ యాదవ్, మహేష్, చింటూ, శ్రీను, జి.సంతోష్, తులసి, వై.మహేష్, బిట్టు, సాయి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.



