
చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 16 భారతజ్యోతి: గౌలిపురా డివిజన్ లోని జానకిదాస్ మఠం కంపౌండ్ వాల్ పనులను శుక్రవారం మాజీ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలే జితేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అలే జితేంద్ర మాట్లాడుతూ… అత్యంత పురాతమైన జానకిదాస్ మఠం కంపౌండ్ వాల్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నట్లు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా రూ.8.50 లక్షల నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అత్యంత పురాతమైన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ జి.రఘుకాంత్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఇ. సుమన్ కుమార్ ముదిరాజ్, భాగ్యనగర్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కౌడి సురేందర్, నాయకులు కె.ప్రేమ్‌రాజ్, జమాల్పూర్ అశోక్, కె.రాజ్ కుమార్, బి.రాజు యాదవ్, సిహెచ్.నర్సింగ్, బస్తీవాసులు సాయి కిరణ్, ఎస్.బాబు, చందు, రాము గౌడ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.



