
చాంద్రాయణగుట్ట, భారత జ్యోతి: హరిబౌలి డివిజన్ లాల్ దర్వాజా చేపలగల్లిలో స్థానిక ప్రజల సౌకర్యార్థం తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన పబ్లిక్ వాటర్ ట్యాప్ ను మంగళవారం గౌలిపుర మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర, బిజెపి నాయకుడు ఉదయ్ కిరణ్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, వారి సమస్యల పరిష్కారానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సాయికిషోర్, ఆవుల వినోద్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.




