సరూర్నగర్ మిస్సింగ్ అయిన ఆరు సంవత్సరాల బాలికను గుర్తించిన పోలీసులు……
సరూర్నగర్ పోలీసులను అభినందించిన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అనురాధ.........

సరూర్నగర్ మిస్సింగ్ అయిన ఆరు సంవత్సరాల బాలికను గుర్తించిన పోలీసులు……
సరూర్నగర్ పోలీసులను అభినందించిన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అనురాధ………
ఎల్బీనగర్ అక్టోబర్ 14 భారత జ్యోతి.
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో బుధవారం ఉదయం మిస్సింగ్ అయిన అనీషా అనే ఆరు సంవత్సరాల బాలికను సరూర్నగర్ పోలీసులు గుర్తించారు. బాలిక అదృశ్యం గురించి 100కు కాల్ చేయగా స్పందించిన సరూర్నగర్ పోలీసులు బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మిస్సింగ్ అయిన ఆరు సంవత్సరాల అనీషా అనే అమ్మాయిని సాయి నగర్ పరిసర ప్రాంతంలో బాలికను గుర్తించారు. బాలిక మిస్సింగ్ అయిందన్న సమాచారం మేరకు ఎల్బీనగర్ డిసిపి అనురాధ, ఎల్బీనగర్ ఏసిపి రవీందర్ రెడ్డి, లు సాయి నగర్ లో పర్యవేక్షించిన అనంతరం డిసిపి అనురాధ మాట్లాడుతూ నిరంతరం ప్రజల రక్షణకు పోలీసులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారని దీనివలన నేర నియంత్రణ లను తగ్గుతున్నాయని ఆమె పేర్కొన్నారు



