తెలంగాణ
టీ20 మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటిం మార్కెటింగ్ గుట్టురట్టు.
హెచ్సీఏ సభ్యుడితో పాటు మరో ముగ్గురు అరెస్ట్.
టీ20 మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటిం మార్కెటింగ్ గుట్టురట్టు.
హెచ్సీఏ సభ్యుడితో పాటు మరో ముగ్గురు అరెస్ట్.
హైదరాబాద్ అక్టోబర్ 14 భారత జ్యోతి.
టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని హైదరాబాద్లోని గోషామహల్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవతో పాటు ఆయన కుమారుడు ఆకర్షిత్, అవినాష్, మోహిత్ సోనిమలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
సతీష్ చంద్ర శ్రీవాస్తవ తన కుమారుడి ద్వారా టికెట్లను అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన గోషామహల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ నలుగురిని అరెస్టు చేశారు.




