దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఎల్బీనగర్ సిఐ వెంకటేశం.

దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఎల్బీనగర్ సిఐ వెంకటేశం.
ఎల్బీనగర్ అక్టోబర్ 18 భారత జ్యోతి.
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ఎల్బినగర్ ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎల్బీనగర్ సీఐ వెంకటేశం వెల్లడించారు
ఆదివారం ఎల్బీనగర్ పోలీస్ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రయాణానికి ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని. పండుగ సెలవుల్లో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తుండటంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కనుక తమ విలువైన వస్తువులను భద్రపరచుకొని వెళ్లాలని సిఐ వెల్లడించారు. నగదును బంగారు ఆభరణాలను బ్యాంకులోని లాకర్లలో భద్రపరచుకొని వెళ్లాలని ఆయన సూచించారు. ఇంటికి తాళం వేసినట్టు కనపడకుండా డోర్ కర్టెన్ ఏర్పాటు చేయాలని, ఇంటిలో లైట్లు పూర్తిగా బంధు చేయకుండా ఒక లైట్ వేసి ఉంచాలని దీని వలన ఇంట్లో ప్రజలు ఉన్నట్టు తెలుస్తుందని దొంగతనాలు జరగడానికి అవకాశం లేకుండా ఉంటుందని చెప్పారు. అలాగే ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని ఉత్సాహంతో వెళ్లే ప్రజలు తమ ఇండ్లలోని గ్యాస్ సిలిండలను బంద్ చేసి వెళ్లాలని అజాగ్రత్తగా ఓపెన్ చేసి వెళ్లడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని వీటన్నిటిని గుర్తు పెట్టుకొని దసరా పండుగకు సొంత గ్రామానికి వెళ్లి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎల్బీనగర్ సీఐ వెంకటేశం ప్రజలనుకోరారు.



