తెలంగాణరాజకీయం

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన పోలీసులు…

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ఇన్స్పెక్టర్ మహ్మద్ ఆసిఫ్..

చాంద్రాయణగుట్ట, అక్టోబర్ 16 భారత జ్యోతి : ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడపరాదని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఆసిఫ్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మహ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ… ట్రాఫిక్ నియమ నిబంధనలను ఆటో డ్రైవర్లు తప్పకుండా పాటించాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆటోలు నడుపుతున్న సమయంలో సెల్ఫోన్లు మాట్లాడకూదన్నారు. ఆటోలో అదనపు ప్రయాణికులు, అధిక మంది విద్యార్థులను తీసుకెళ్ల కూడదన్నారు. రోడ్డు మధ్యలో ఆటోలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై కార్తీక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button