మర్రిగూడ మండలంలో మట్టి, ఇసుక దందా జోర్….,.. చూసి చూడనట్టుగా వివరిస్తున్న సంబంధిత అధికారులు…….
ప్రతిరోజు స్టేషన్ ముందు నుండి మట్టి టిప్పర్లు పోతున్న పట్టించుకోని పోలీసులు....

మర్రిగూడ మండలంలో మట్టి, ఇసుక దందా జోర్….,..
చూసి చూడనట్టుగా వివరిస్తున్న సంబంధిత అధికారులు…….
ప్రతిరోజు స్టేషన్ ముందు నుండి మట్టి టిప్పర్లు పోతున్న పట్టించుకోని పోలీసులు….
నల్గొండ/ మర్రిగూడ: అక్టోబర్ 19 భారత జ్యోతి.
మర్రిగూడ మండల కేంద్రంలోని శివన్నగూడ రిజర్వాయర్ లో ప్రతిరోజు రాత్రనకా, పగలనకా భారీ టిప్పర్ల ద్వారా మట్టి మాఫియా లీడర్లు మట్టి తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ప్రతిరోజు శివన్నగూడ రిజర్వాయర్ లో హిటాచి, జెసిబి భారీ యంత్రాల ద్వారా ప్రాజెక్టు కట్టకు మట్టి తరలిస్తున్నామంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ప్రాజెక్టు పేరుతో టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తూ మట్టి మాఫియా లీడర్లు జేబులు నింపుకుంటున్నారు. రోడ్లపై ప్రతిరోజు మట్టి టిప్పర్లు మట్టిని తరలిస్తూ అధికారుల ముందు నుండి వెళ్తున్న పట్టించుకోనటువంటి అధికారులు. స్థానికులు సమాచారం ఇస్తే పోలీసులు ఒక టిప్పర్ పట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుండి మట్టి టిప్పర్లు పోలీస్ స్టేషన్ ముందు నుండి వెళ్లడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు?. అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో ఇసుకను ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా ఆటోల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నుంచి ఇసుక తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌన వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం రిజర్వాయర్ నుండి మట్టి తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందిస్తే రామిరెడ్డిపల్లి పరిసర ప్రాంతంలో టిప్పర్ టీజీ 12 యు 5166 గల ట్రిప్పర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




